30, జనవరి 2011, ఆదివారం
వసుధమాట.
వేలగొంతుకలు ఒక్క స్వరపేటికలో చేరి అరుస్తూ నేవున్నా గుండె వాటిగొంతు నొక్కు తూనే ఉంది .బుద్ధి నీకై మరలమని మొర పెడుతూనే వున్నా హృదయం వద్దని బుజ్జగిస్తునే వుంది .జ్ఞానం తన నేత్రం తెరిచి నిను కాంచ మంటున్నా మోహం పొరలు కప్పి ఆపుతోనే వుంటుంది . నినుపలకని స్వరం,నిను ఊహించని బుద్ధి,నిను కాంచని నేత్రం ,వ్యర్థమని ఆత్మ లోలోపల ఘోషిస్తూనే వుంటుంది . ఈ విరుద్ధ భావాల అంతర్ మధనం నాలో ఇమడలేక సతమత మవుతుంది . వీటినుంచి నను కడతేర్చే నాదునివి నీవే నని తెలిసినా అహం వీడి ప్రార్ధించ లేని మూర్ఖత్వము నాది.
27, జనవరి 2011, గురువారం
వసుధమాట.
బ్రతుకు వ్యామోహం, నా దన్న బంధం,నాకున్న మోహం,నేనన్న అహం,నిను సేవింప అడ్డం .
24, జనవరి 2011, సోమవారం
వసుధమాట.
భిక్షపాత్ర నా చేతిలోనేఉంది నిన్ను ఏమి అర్ధించాలో నాకు తెలియడం లేదు.తడి ఆరిపోతున్న నా పెదాలతో నీ నామముచ్చరిస్తూ నీ ద్వారం వంక చూస్తూ అలా నిలబడి ఉన్నాను. పలుచని తెరలాటి పొగతో నీ తలుపులు తెరుచుకొన్నాయి.వెలుగు నిండిన కన్నులతో,మంద స్మితంతో,మందగమనంతో మెల్లగా నీవు నా వైపుకి అడుగులేస్తూ వస్తున్నావు. నా నిరీక్షణ ఫలించిదన్న ఆనందం, నీవు నాచెంత కొస్తున్నావన్న సంతోషం,అది నీ వేనా అన్న సంబ్ర్హమం అన్ని భావాలు మిళితమై నా కన్ను రెప్ప వేయడం ఆపేసింది.నా గుప్పెడు గుండె కొట్టుకోవడం మరిచి పోయింది.మసక బారుతున్న నా చూపుకు చేతులు చాచిన నీ రూపం లీలగా కనబడుతూ కనుమరుగవుతోంది .చివరికి నేను నిను చేరానా నీవు నను చేర్చుకోన్నవా తెలేనే లేదు.
23, జనవరి 2011, ఆదివారం
వసుధమాట.
నీ నుంచి జాలు వారే ప్రేమ నన్ను నిత్య నూతనోస్తాహపు జల్లులతో తడిపే స్థూ ఉంటుంది . జీవితమంటే బ్రతకటం కాదు జీవితమంటే జీవించడం అని అనుక్షణం అది గుర్తుచేస్తుంటుంది . సమస్త జీవరాశిలో నీప్రేమ సుమం వికసించి వికసించి మరీ పరిమలిస్తుంటుంది. లయతప్పని జీవన కంజీర నాదాన్ని చిరుగాలి సైతం నా చెంత చేర్చి వినిపిస్తుంటుంది .
19, జనవరి 2011, బుధవారం
వసుధమాట.
నిన్నటి ప్రదోష కాల పూజలో దోషం ఏదైనా చేశానా ఈరోజు సుప్రభాత వేళకి నీ మోము చిన్న బుచ్చుకుంది . మరీ వేడి పదార్థాలు తొందరలో నివేదించానా నాసాగ్రం ఎర్రబడి చుబుకం కన్దిఉన్ది. నీ కిచ్చిన కర్పూరపు తాంబూలం తీసుకెళ్ళి దేవేరికి సమర్పించ్చావా ? ఎర్రగా ఉండాల్సిన నీ పెదాలు అలానే ఉన్నాయ్ . రొజూ నే చేసే సపర్యలన్నిటికి నిజంగా నీ ప్రతిచర్య ఉంటుందంటావా ? ఇవన్ని నా భావనలే అయితే ఇంత వింత భావనలతో నను పుట్టించినది ఎవరు ? నీవే కదూ? విచ్చిన నీపెదవుల దరహ్హాసం నా కధని మళ్ళి మొదటికి తెస్తోంది.
17, జనవరి 2011, సోమవారం
వసుధమాట.
నీకు నాకు నచ్చిన రూపమిచ్చి, కనబడిన ఆక్రుతినల్లా నీకంటగట్టి ,నా అవసరానికి నీకొక అవతార మంటగట్టి ,నేను వదలలేని భావోద్వేగాలు నీకు ఆపాదించి ,నిను అర్చించి ,అభిషేకించి ,నను ఉద్ధరించ రావేమని ప్రశ్నిస్తూనే ఉన్నాను జన్మ జన్మలుగా,యుగయుగాలుగా నాలోని నిన్ను కూకటి వేళ్ళతో పెకలించి చిత్రంగా నీ చిత్తరువుకై వెతుకుతున్నాను .
12, జనవరి 2011, బుధవారం
వసుధమాట.
నిర్వికల్పుడవు ,నిరాకారుడవు నిను దర్శించ మనోనేత్ర మావస్యకము ,జడదారివి ,కఠోరుడివి నిను తెలుసుకొన జ్ఞాననేత్ర మావస్యకము , నాలోని దుర్గుణాలను దహించగా నీ త్రినేత్ర మావస్యకము ,అర్థనారీస్వరా, బోళాశంకరా కరుణించి నీ తత్వము తెల్పుము అవశ్యము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)