17, సెప్టెంబర్ 2011, శనివారం

vasudhamata

antharmadhanam,aathmavalokanam nanu nee daricherchy saadhanaalu. ahankaaram,aathmasthuthi nanu neeku dooram chese vyapakaalu. naa vedukulaata nee kosam,nenante theleyani naa kosam. nee vevaro naaku theliyalante,nenevaro neevu cheppali.neeku naaku madhyaunna aa sunnithamaina,drhudamaina bandha medo naaku theliyaali.

5, ఆగస్టు 2011, శుక్రవారం

vasudhamata

ninnu chodalani neetho undaalani ennenno anukunnanu nuvvu naaku kanapadalani neeku nuvvu anukune roju epudu vachhunokada?

25, మే 2011, బుధవారం

వసుధమాట

నిరంతరంగా నీ ఊహలు నను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ,నీ కోసం ప్రతేకంగా ధ్యానం ఎలా చేయను?అనవరతం నీ పేరు నా కర్ణాతరాలాలలో మారుమ్రోగుతుంటే ,నీ నామం నాలుక చివర మాత్రమేఎలా జపించను?శరీరపు ప్రతి అణువు నీకై తపించి పోతుంటే కేవలం అరచేతుల్ని తాడించి నీ భజన ఎలాచేయను ? నవ విధభక్తులలో నాది ఏదో నాకు తెలీదు.నాకు తెలిసింది ఒక్కటే నీ ఉనికి నాలో చూసుకొని నీకై నేను జీవించడమే.

వసుధమాట

నాతో నేను ప్పోరాటం చేస్తున్నపుడు బయటి శత్రువులతో నాకేం పగలేదు నా నాలుక,,,నా కోరిక,,,నా అహం,,,ఇవే నా ప్రథాన వైరి వర్గం . నీ మీద భక్తి నా దివ్యాయుధం . నన్ను నేను గెలిచిన రోజున ప్రపంచంతో నాకు పనిలేదు . విజయమో వీర స్వర్గమో నాతో నేనే తేల్చుకొని నాపైని నా గెలుపుకు నిను పొందడమే నా పోరాట లక్ష్యం ఇపుడు.

15, మార్చి 2011, మంగళవారం

వసుధమాట.

నీ కోసం ఏదైనా చేయడం అంటే నాకోసం నేను చేసుకోవడమే నీ వైపు నేను వేసే ప్రతి అడుగు నా అంతరంగ అభ్యున్నతికై నేనేక్కుతున్న నిచ్చన మెట్టే . మరిదానికి నీ పైని భక్తి అన్న ముసుగెందుకు ! నా జీవన ఉద్దారకుడా ! నా అహంవీడి నిను అర్థిస్తున్నా నా జీవన భిక్ష పాత్రలో నీ కరుణని కురిపించకుంటే మరుజన్మ నాకుంటే ఈ కొంచం సంస్కారమైనా నాకు సంప్రాప్తిన్చునో లేదో .

వసుధమాట.

అర్పితం కానిది ఏదీలేదు మనసుతప్ప దాన్ని నీకిచ్చే అర్హత నాకు లేదు. పూచిన పుష్పాలన్నీ కోవెలని చేరగాలవా? అయినా ఎదోవొకమూల చిన్న ఆశ గాలివాటుగా నైనా నీ పదసన్నిధి చేరకపోనాఅని.మరేదోమూల వణికించే భయం,ఈలోగా సందేవాలి పోతే? మరోవేకువ నాకు ప్రసాదిస్తావా మరి

3, మార్చి 2011, గురువారం

vasudhamata

నిన్ను వెతుక్కుంటూ ప్రపంచ యాత్ర పూర్తి చేసాను . నా అన్వేషణ మొదలెట్టిన చోటికి వచ్చాక గాని తెలియలేదు నువ్వు నాలోనే వున్నావని.

28, ఫిబ్రవరి 2011, సోమవారం

వసుధమాట.

ప్రకృతిలో ప్రతి చర్యా మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటుంది . మారిన రుతువు సహా వేకువ,చీకటివోకదానివెంట వొకదానివెంట వొకటి వస్తూనే ఉంటాయి . మనిషి అనాగరికుడులా మళ్లీ మొదటికొస్తాడు.ప్రకృతినైన,వికృతి నైనా సవరించి సరిచ్యేయ మని నిను కోరముకాని . మనిషి విష పూరిత స్వార్థపు గుణాలను పునరావృతి క్రమము లోనైనా తొలగించు. లేకుంటే నిన్ను తొలగించి వాడు నేనే దేవుడినంటున్నాడు. మార్చలేని నీ ప్రకృతి శాసనాన్ని వాడు మార్చి చూపిస్తున్నాడు.

17, ఫిబ్రవరి 2011, గురువారం

వసుధమాట.

నేనే నీవైనపుడు నీకూ నాకూ మధ్య తేడా ఏంటి? అని విర్రవీగాను .నీలా మారదామని చాలా ప్రయత్నాలే చేసాను కాని అడుగడుగునా నాలోని అహం,స్వార్థం ,మదం,మాత్సర్యం ,మనిద్దరి మధ్య ఆంతర్యాన్ని చూపుతూనే ఉన్నాయి. నేను నీలా మారడానికి మరి ఎన్ని జన్మ లేత్తాలో కదా . కనీసం నీ ఎదుట తల ఎత్హుకొని నిలబడటాని కైనా నేనేం చేసానని.

7, ఫిబ్రవరి 2011, సోమవారం

వసుధమాట.

నీకై అన్వేషణ నా నుంచే మొదలిడదామని అంతరంగ చింతన చేసాను నీ ఆచూకీ లేనేలేదు . నాలుగు చేతుల వేయి తలల నీ రూపం నాకు అడుగుపడనే లేదు లోపల బయట నీకై వెతికి వెతికి వేసారి అలసి కూర్చున్న నాకు నీ దర్శనం అయింది చిత్రంగా . గుడ్డివాడిని చేయి పట్టి దారి దాటిస్తున్న చిన్నారిలో ,వాకిటిలో నిలబడి ఆకలని కేకేసిన అభాగ్యుని బొచ్చెలో అన్నం వేస్తున్న ఇల్లాలిలో ,ప్రతి ఫలాపేక్ష లేకుండా ఇతరులకై పాటుపడే ప్రతి వొక్కరిలో నీ ప్రతిరూపం కనబడుతూనే వుంది .

30, జనవరి 2011, ఆదివారం

వసుధమాట.

వేలగొంతుకలు ఒక్క స్వరపేటికలో చేరి అరుస్తూ నేవున్నా గుండె వాటిగొంతు నొక్కు తూనే ఉంది .బుద్ధి నీకై మరలమని మొర పెడుతూనే వున్నా హృదయం వద్దని బుజ్జగిస్తునే వుంది .జ్ఞానం తన నేత్రం తెరిచి నిను కాంచ మంటున్నా మోహం పొరలు కప్పి ఆపుతోనే వుంటుంది . నినుపలకని స్వరం,నిను ఊహించని బుద్ధి,నిను కాంచని నేత్రం ,వ్యర్థమని ఆత్మ లోలోపల ఘోషిస్తూనే వుంటుంది . ఈ విరుద్ధ భావాల అంతర్ మధనం నాలో ఇమడలేక సతమత మవుతుంది . వీటినుంచి నను కడతేర్చే నాదునివి నీవే నని తెలిసినా అహం వీడి ప్రార్ధించ లేని మూర్ఖత్వము నాది.

27, జనవరి 2011, గురువారం

వసుధమాట.

బ్రతుకు వ్యామోహం, నా దన్న బంధం,నాకున్న మోహం,నేనన్న అహం,నిను సేవింప అడ్డం .

24, జనవరి 2011, సోమవారం

వసుధమాట.

భిక్షపాత్ర నా చేతిలోనేఉంది నిన్ను ఏమి అర్ధించాలో నాకు తెలియడం లేదు.తడి ఆరిపోతున్న నా పెదాలతో నీ నామముచ్చరిస్తూ నీ ద్వారం వంక చూస్తూ అలా నిలబడి ఉన్నాను. పలుచని తెరలాటి పొగతో నీ తలుపులు తెరుచుకొన్నాయి.వెలుగు నిండిన కన్నులతో,మంద స్మితంతో,మందగమనంతో మెల్లగా నీవు నా వైపుకి అడుగులేస్తూ వస్తున్నావు. నా నిరీక్షణ ఫలించిదన్న ఆనందం, నీవు నాచెంత కొస్తున్నావన్న సంతోషం,అది నీ వేనా అన్న సంబ్ర్హమం అన్ని భావాలు మిళితమై నా కన్ను రెప్ప వేయడం ఆపేసింది.నా గుప్పెడు గుండె కొట్టుకోవడం మరిచి పోయింది.మసక బారుతున్న నా చూపుకు చేతులు చాచిన నీ రూపం లీలగా కనబడుతూ కనుమరుగవుతోంది .చివరికి నేను నిను చేరానా నీవు నను చేర్చుకోన్నవా తెలేనే లేదు.

23, జనవరి 2011, ఆదివారం

వసుధమాట.

నీ నుంచి జాలు వారే ప్రేమ నన్ను నిత్య నూతనోస్తాహపు జల్లులతో తడిపే స్థూ ఉంటుంది . జీవితమంటే బ్రతకటం కాదు జీవితమంటే జీవించడం అని అనుక్షణం అది గుర్తుచేస్తుంటుంది . సమస్త జీవరాశిలో నీప్రేమ సుమం వికసించి వికసించి మరీ పరిమలిస్తుంటుంది. లయతప్పని జీవన కంజీర నాదాన్ని చిరుగాలి సైతం నా చెంత చేర్చి వినిపిస్తుంటుంది .

19, జనవరి 2011, బుధవారం

వసుధమాట.

నిన్నటి ప్రదోష కాల పూజలో దోషం ఏదైనా చేశానా ఈరోజు సుప్రభాత వేళకి నీ మోము చిన్న బుచ్చుకుంది . మరీ వేడి పదార్థాలు తొందరలో నివేదించానా నాసాగ్రం ఎర్రబడి చుబుకం కన్దిఉన్ది. నీ కిచ్చిన కర్పూరపు తాంబూలం తీసుకెళ్ళి దేవేరికి సమర్పించ్చావా ? ఎర్రగా ఉండాల్సిన నీ పెదాలు అలానే ఉన్నాయ్ . రొజూ నే చేసే సపర్యలన్నిటికి నిజంగా నీ ప్రతిచర్య ఉంటుందంటావా ? ఇవన్ని నా భావనలే అయితే ఇంత వింత భావనలతో నను పుట్టించినది ఎవరు ? నీవే కదూ? విచ్చిన నీపెదవుల దరహ్హాసం నా కధని మళ్ళి మొదటికి తెస్తోంది.

17, జనవరి 2011, సోమవారం

వసుధమాట.

నీకు నాకు నచ్చిన రూపమిచ్చి, కనబడిన ఆక్రుతినల్లా నీకంటగట్టి ,నా అవసరానికి నీకొక అవతార మంటగట్టి ,నేను వదలలేని భావోద్వేగాలు నీకు ఆపాదించి ,నిను అర్చించి ,అభిషేకించి ,నను ఉద్ధరించ రావేమని ప్రశ్నిస్తూనే ఉన్నాను జన్మ జన్మలుగా,యుగయుగాలుగా నాలోని నిన్ను కూకటి వేళ్ళతో పెకలించి చిత్రంగా నీ చిత్తరువుకై వెతుకుతున్నాను .

12, జనవరి 2011, బుధవారం

వసుధమాట.

నిర్వికల్పుడవు ,నిరాకారుడవు నిను దర్శించ మనోనేత్ర మావస్యకము ,జడదారివి ,కఠోరుడివి నిను తెలుసుకొన జ్ఞాననేత్ర మావస్యకము , నాలోని దుర్గుణాలను దహించగా నీ త్రినేత్ర మావస్యకము ,అర్థనారీస్వరా, బోళాశంకరా కరుణించి నీ తత్వము తెల్పుము అవశ్యము.