28, డిసెంబర్ 2010, మంగళవారం

వసుధమాట.

ఆత్మ చింతన కలుగుట అంతతేలికగాదు గత జన్మ ఫలితము తరమకుండా వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధమాట.

కర్మ నీది ఫలమాతనిదా? చేసేకార్యమంతా ఆతనిదే అయిన ఫలమెవనికివచ్చు నీకు గాక వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

26, డిసెంబర్ 2010, ఆదివారం

వసుధ మాట.

నీకూడ జన్మించి,నీ లోనపెరిగి ,నీతోనే నడిచి,నీలోనే నిలిచేది నీనీడ కాదు అదే పరమాత్ము జాడ ,వాస్తవమ్ము సుమ్మి వసుధమాట.

19, డిసెంబర్ 2010, ఆదివారం

వసుధమాట.

అపుడు నేను శబరిని, నీవు రాముడివి.అపుడు నేను కుచేలుడిని,నీవు నా చెలికాడవు.అపుడు నేను రాధను,నీవు నా ప్రేమికుడవు.నేను అర్జునుని,నీవు నా హితునివి.నేను హనుమంతుని,నీవు నా స్వామివి.ప్రతిజన్మలోను భువనాంత రాళాలు దద్దరిల్లే కీర్తి శిఖ నీవు.అతిసామాన్యము నేను.ఈ అల్పత్వానికి నిను పొందే అర్హతేమిటని? ప్రతిసారి అందరికీ ఆశ్చర్యమే.నిను తెలుసుకోవటమే నన్ను నీ దగ్గరికి చేర్చే సూత్రమని వారికి తెలీదు.వారిప్రయత్నమంతా డంబచారలతో నిన్ను పొందాలని,శాకపాకానికి,తులసీదళానికి నువ్వు సరితూగటం వారు జీర్ణించుకోలేరు.నిను కఠినాతుముని చేసి మరింత జటిలం చేయటమే వారి ద్యేయమనుకొంట.

వసుధమాట.

నేనెంత మూర్ఖంగా ఉన్నా నీ ఉనికి వదలని జ్ఞాపకంలా నను వెంటాడుతూనే ఉంటుంది. అనుక్షణం నా ఊపిరిలో నీ వేణువు వింటునేవున్నానిను ఒప్పుకోలేని మకురుతనం నాది.వెలుగులో,చీకటిలో,మెలకువలో,కలలో,వేకువలో,మునిమాపులో,జీవితపు ప్రతిమలుపులో నీవున్నావన్న సృహ నిరంతరం కలుగు తునేఉన్నా దాన్ని నా అహం అరచెయ్యోడ్డి ఆపుతునే ఉంటుంది.నీవు లేవన్న బ్రమని కల్పించుకొని ప్రతిదానికొక హేతువుని నిర్హేతుకంగా ఏర్పరుచుకొని,నీవు లేవని ఇదంతా నా ప్రయోజకత్వమేనని ,వేదికలెక్కి ఇది హేతువాదమని అరిచినపుడల్లా! నీవు వింటున్నా వన్న సందేహం నను వెంటాడుతోనే వుంటుంది.

18, డిసెంబర్ 2010, శనివారం

వసుధమాట.

నాతోపాటుగా నీవు సృష్టించిన ఈ విశ్వమంతా నాకు చెందినదే. నేను ఈ విశ్వంలా రకరకాల మార్పు చేర్పులకి గురిఅవుతుంటాను.నిను కనుగొననపుడు ఆ కొండలా నేనొక జడపదార్థాన్ని, ఘనమైన నా అహం మంచులా కరిగిన వేళ నీనో ద్రవ పదార్థాన్ని, జీవన సంధ్యాసమయాన చేతులుచాచి నీకై నింగికెగసే వేళ నేనో వాయులీనాన్ని,ఈ అనంత విశ్వంలో నేనో పరమాణువుని అయినా నాకు నేనే అయిన అనంత చైతన్యాన్ని .

వసుధమాట.

మలినం మనసులోనిదైతే పరిశుద్ధి చేసే ప్రక్రియ క్లిష్ట్టతరం నీది నీకు కాక ఇతర మనోవికారాలన్నీ అంటించుకొంటే జీవితం అంతా దాన్ని తొలగించే ప్రయత్నంలోనే గడిచిపోతుందేమో. ఎదలోనివెలుగు నీకు నీచుట్టూ జీవకోటికి కాంతిని,శాంతిని,సుభ్రతని ఇస్తుంది. అపుడు దివినుండి ప్రసరించిన దివ్యమైన వెలుగు చిన్ని గుండెకవాటం లోకి సూటిగా దూసుకు పోతుంది.

14, డిసెంబర్ 2010, మంగళవారం

వసుధమాట.

ప్రతిరోజూ ఉదయిస్తూనే ఉంటాడు సూర్యుడు వెలుగు విలువ తెలుసుకోమని ,బద్ధకపు మనిషి అట్టే కాలం వెళ్ళ భుచ్చుతుండగానే ఈ రోజు నీ గతి ఇంతే నంటూ అస్తమిస్తాడు . నిరతర ఈ జీవన సత్యం ఈ మనిషికెందుకు అవగతం కాదు .వెలుగును ,వెన్నెలను,ఏమరపాటుతో దూరం చేసుకొని ఏడుస్తూ చీకటిని కావలించుకొని కూర్చున్ టాడెందుకు .

12, డిసెంబర్ 2010, ఆదివారం

వసుధమాట

నీవేకనుక సత్యమైతే నా అర్థంలేని వ్యర్థ కోరికలని తీరుస్తావు .లేకుంటే మరోపేరిట మరోనీవు ,నా నివేదన అంతా కోరికల మయమే ,నాక్కవలసినది నా కోర్కెలు తీర్చేనీవు ,అచ్చుగా నిన్ను నీలా నేనేమి చేసుకోను ,నేనే లేకుంటే నిన్ను తలచుకొనే వారున్డరని నా ధీమా, ఆ భావనే నీ సత్య నిరూపణా పరీక్షకై నన్ను పురికొల్పుతోంది.

7, డిసెంబర్ 2010, మంగళవారం

వసుధమాట.

అల్పములు అనేకములు అధికుడవైన నిను చేర, జీవన చరమాంకములో నీ నుండి పిలుపు వచ్చిన వేళ ,నీ దర్బారులో నీ ఎదుట నిలబడి సగర్వంగా సవినయంగా,నీకు చెప్పుకోవటానికి జీవితకాలంలో నాలుగు మంచిపన్లేమి చేసానుగనుక, నీ విచ్చిన విలువైన ఈ జీవితాన్ని నిర్లజ్జగా నా స్వార్థం కోసం వ్యర్థం చేశాను,నిను చేరేవేళ వచ్చిన రోజున హడావిడిగా బూటకపు త్యాగాల మెరుగులెన్ని దీనికి అద్దితేమాత్రం ఏం లాభం? పుట్టినది మొదలు నా వ్యర్థ జీవన ప్రతిక్షనపు
చిట్టా నీ చెంతఉన్నపుడు.

2, డిసెంబర్ 2010, గురువారం

వసుదమాట.

అడగకుండా వచ్చిన దాని విలువ తెలియదు , అయాచితంగా నీ విచ్చిన ఈ జన్మలవిలువ మాకు తెలియదు. తుచ్చ వాన్చ్చాసాధన ముందు ఎనలేని నీ ప్రేమవిలువ వెల వెల పోతోంది. ప్రకృతిలోని ప్రతి చిన్ని గడ్డిపువ్వుతో సహా ప్రతిది నీవు మాకోసం సృజించినదే . నీవిచ్చిన వేవి ఆస్వాదించకుండానే ,మరివేటితోనో సరిపోల్చుకొని , ఎనలేని ఆనందపు జీవితాన్ని దుఖపు తరాజుతో కొల్చుకొని . వ్యామోహాల మోహం తీరని , జీవన మాధుర్యం తెలియని ప్రతి మనిషి ,భగవంతుడా నన్నెందుకు సృష్టించావని ? నిన్నడిగేవారే .నేనూ నిన్నొకటి అడుగుతున్నాను నీవిచ్చిన ఈ జన్మని సాఫల్యం ఎలా చేసుకోను ? ఈ భువిపై నీవు నా కిచ్చిన ప్రతిక్షనానికి నీకు కృతజ్ఞతలు ఎలా తెలుపుకొను.

వసుధ మాట.

నన్ను నేను వెతుక్కొంటు నిన్ను పొందాను నా గురించి మరింక నాకు స్పృహే మిగిలిలేదు , అంతట అన్నిటా నిన్ను చూస్తూ నిరంతర వుద్వేగపూరిత , ఉత్తేజ పూరిత జీవితానందం అనుభవించడం అది అందిచిన నీకు అనవరతం కృతజ్ఞతలు తెలుపు కుంటుఉండటం . దీనికి భాషతో నాకు పనిలేదు , నీ భావన తప్ప , నీ రూపం తో పని లేదు , నీ ఉనికి నాకు తెలుసుకనుక , నీ నామం నా కక్కరలేదు ,ప్రతి పేరూ నీదే కనుక , మంచిలో ,చెడులో , ప్రకృతిలో ,వికృతిలో,నీటిలో , నిప్పులో, నింగిలో ,నేలపై, జడం,చేతన్యం ,ఏదైనా ,ఏమైనా , నా నేత్రాలు ,చూడగలి గిననంత మేర నీవే ,ఎందుకంటే నా మనోనేత్రపు కనుపాపపై ఉన్నది నీ చిత్రమే కనుక.