28, నవంబర్ 2010, ఆదివారం
వసుధ మాట.
నిజంగా నీ మీద భక్తా ,నా కోర్కెల సాధనకై వ్యామోహమా? గంగను తలపై గల నీవు నా ఘటభిషేకానికి సంతుష్టుడవవుతున్నావా? జటధారివి నేనర్పించే పుష్పాలు నీవేం చేసుకుంటావు ? అనంతునివి నీ కల్ప రూపమిచ్చి నా కవితాశక్తిచే నీకు గొప్ప గొప్ప స్తోత్రాలు చేస్త్యేనిజంగా అవి నీ చెవులను తాకుతున్నాయా? రాజాధిరాజువి విశ్వమంతా నీ సామ్రాజ్యమే నీది కానిది ఏది నీకు నేను అర్పించగ్గలను.
26, నవంబర్ 2010, శుక్రవారం
వసుధ మాట.
నిన్ను ప్రేమించడం నీ కోసం స్వప్నించడం తప్ప మరేమీ చేతకాదు నాకు . విశ్వమంత నిన్ను విగ్రహంలో బంధించి చూడటం నా వల్ల కాదు . నీ గురించి నా కు తెలిసినదల్లా ,నీ రంగు సంజె కెంజాయ రంగు, నీ రూపు ఉదయిస్తున్న వెలుగు రేకు , నీ కోపం మండుతున్న సూర్యాగ్ని గోళం , నీ కరుణ చల్లని వెన్నెల , ఈ జగతిపై నీ ప్రేమ పచ్చని ప్రకృతి , ఈ జీవకోటి అంతా నీ పరమాణు రూపం.
24, నవంబర్ 2010, బుధవారం
వసుధ మాట.
చూసినవాడు చెప్పినది విని చూడనివాడు ఊహించి తెలిసికొంటాడు . నా కంటే ఆద్యులు నీ గురించి ఎంతో చెప్పారు . నా కల్పనలో నీ వర్ణ చిత్రం వర్ణనాతీతం ,నీవు నా రంగుల జిలిబిలి స్వప్నానివి , నిన్ను గురించిన ఊహాగానాలతోనే నా జీవితం గడిచిపోతున్ దేమో . నా తర్వాతి వారికి నీ గురించి ఏమి చెప్పను ? నీవు నా కలల రాకుమారుడవు కాని కల్ల కాబోకు . వెర్రివాడు సాక్షం తో సహా నిను తెలుసుకో గోరతాడు. వారికి చూపడానికి నీకు తప్పితే పనికిరాని భక్తి తప్ప మరేం లేదు నా దగ్గర.
21, నవంబర్ 2010, ఆదివారం
వసుధ మాట.
స్నేహానికి శుభాకాంక్షలు ఎపుడూ ఉంటాయి. ఎంచుకునే అవకాశం గల ఒకేఒక బంధం స్నేహం . మిగిలినవన్నీ మన ప్రమేయం లేని కష్ట నిస్టురాల బలవంతపు బంధాలు.నీతో నాకు స్నేహమేమిటని వెర్రిగా చుస్తున్నారీజనం . ఎంచుకొనే అవకాశం ఇచ్చినాక నిన్ను గాక మరిఎవరిని ఎంచుకోను ? నీకు సంబంధించిన ఏ అవకాశం వదులు కోలేను కదా?
వసుధ మాట.
నన్ను నీ దగ్గరికి రాకుండా ఆపగలిగేది లోపభూఇష్ట మైన నా నిశ్చలత్వం మాత్రమే . అదేకనుక నాకుంటే నీవాడి చక్రము ,నీ వేడి త్రిశూలము కూడా నన్ను నీ చెంత చేరకుండా ఆపలేవు . నీవు నా వాడవని నిస్చైంచుకున్న ప్రతిసారి ప్రలోభాల రాజ్యములో అత్యున్నత పదవి నన్ను ఊరిస్తుంది .యుగ యుగాలుగా ఉన్న నీవు నా కోసం నాల్రోజులు ఉండకపోతావా అని అటుకేసి పోతుంటాను. కాని అంతరాళాలలో నీ ఊపిరి వేదఘోషై వినిపిస్తుంటుంది ,మనసు మళ్ళి నీ పై నిశ్చ లత్వానికి పరుగెడుతుంది.ఎటూ నిలువని కాలుతో ,ఏదీ పొందని మనసుతో నాజీవితం ఈ మిధ్యావాదం మధ్య లోనే తెల్లవారి పోతుందేమో ?
వసుధ మాట.
నీ నుండి దూరమ్ అవుతానేమోనన్న బెంగతో నిన్ను నా ఊహల్లో కౌగిలించుకొని గట్టిగా పట్టుకొని పడుకొన్నాను. నీవు చూపిన చిత్ర విచిత్రమైన రంగుల కలల ఎరచూసి అనంత మైన ఆశలకయి నా చేతులు చాపి తెల్లారి నీకై చూతునా! నా కౌగిలిలో ఉండాల్సిన నీ రూపం చిద్విలాసంగా చిరుగాలికి ఊగుతూ గోడకు వేలాడుతోంది .
9, నవంబర్ 2010, మంగళవారం
వసుధమాట.
నిన్ను ఆకట్టుకోవాలంటే నేను మడి కట్టుకోవాలా?దృష్టి అంతా నన్నేవరెన్న తాకు తారేమోనన్న దానిమీదే , మిగిలిన మనుష్య జాతి అంతా అంటరాని వాళ్ళు నీ వొక్కడివే నాకు చెందిన వాడివన్న భావన నాలో గర్వము పెంచుతోంది, చుట్టూ ఉన్న జీవులంతా అధములు నేను మాత్రం ప్ర్యత్యేకం అని ప్పొరకమ్మిన కళ్ళకు నీ దివ్య మంగళ రూపం చ్చాన్దసపు మసక బారి కన్పిస్తోంది అస్పష్టముగా ఈ అహం విశ్వమాన వాళికి నుండి నను దూరం చేస్తోంది ,ఇప్పుడు చెప్పు నిన్ను ఆకట్టు కోవాలంటే నేను మడి కట్టు కోవాలా?
8, నవంబర్ 2010, సోమవారం
వసుధమాట.
నీ కోసం జపించడం తపించటం ఇదంతా వ్యర్థం అనిపిస్తుంది నీవు నాకు కనపడవేమోనన్న అనుమానం కలిగినపుడు. బీడువారిన నేలనుండి పచ్చని పైరు మొలక తల పయిక్కెత్తినపుడు చిరుజల్లు దాన్ని సున్నితంగా తాకినప్పుడు , ఉదయాస్తమనా లలో ఆకాశం భూమిని తాకిన వేళల్లో మాత్రం నీ దర్శనం అవుతుంది చిత్రం గా. నీ తో ఈ దోబూచు లాటల్లోనే జీవితం గడిచి పోతుందేమో ఎల్ల వేళలా నిన్ను కట్టి పడేసే మంత్రం తెలుపరాద?
వసుధమాట.
భిక్ష పాత్ర నేను పట్టుకొని నీకు దానం ఇస్తున్నానని గర్వించానిన్నాళు ,నీవు జాలితో కురిపించిన ప్రేమామృతం తాగి నేను అమరుడినని అహంకరించాను ,ఈ జీవితం ,ఈ రూపం , ఈ ప్రపంచం అంతా నీ భిక్షేనని తెలిశాక సిగ్గుతో వాలిన నా కనురెప్పల్ని నీ పాదాల నుండి మరల్చలేకున్నాను.
వసుధమాట.
క్షణక్షణం నీదివ్య దర్శనం అవుతూనే ఉంది తెలుసుకునే బుద్ధి నాకు కలిగింది కాదు, కనిపించే ప్రతిది నీ ప్రతి రూపమని తెలీనే లేదు. సమస్తం నీ సృష్టే నని అంతా నీ వేల వేల రూపాలని నా ఈ చిన్న బుద్ధికి ఆలోచనే లేదు. ఈశ్వరా ! ఎట్టకేలకి నిన్ను నేను తెలుసుకొన్నాను . ఇంత కాలం వృధా చేసుకోన్నానన్నదుఖం,తెలుసు కొన్నానన్న ఆనందం రెండు చేరి నా గుండెని నలిపేస్తున్నాయి.
వసుధమాట.
భారమైన భావానికి భాష కొరవడింది భేషజం లేని మనసుభాష నీకు అర్థమవుతుందా? కేవలం మౌనం మాత్రమే నా విచిత్రావస్తని వ్యక్తీకరించే వింత భాష. కంటి రెప్పల చప్పుడు మాత్రమే హృదయ స్పందన నివేదిక.
7, నవంబర్ 2010, ఆదివారం
వసుధమాట.
నా రోదనతో నిన్నుమొరలిడాను నా వేదన తీర్చావు , నా వాంఛల్నినీకు విన్నవించాను నా కోర్కెలని తీర్చావు, నా మౌనాన్ని నీకు నివేదించాను నన్నే స్వీకరించావు , ఈబుద్ధి నాకు మొదట కలిగింది కాదేనని వేదన చెందాను.
వసుధ మాట.
నీకు,నాకు మధ్య వారధిలా నిలిచింది ప్రేమవోక్కటే లేకుంటే ఎవరికేవరో మనం, మనం కనుగొన్న నిత్య నూతన సత్యమొకటే ప్రేమ లేదంటే దైవం లేదు.యుగాలు,కాలాలు,లోకాలు ఏమిమారినా నిలిచిఉండే నిజం జీవమొక్కటే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)