30, ఆగస్టు 2010, సోమవారం

వసుధ మాట.

విద్యను గడిఇంచి వూరుకున్న వానికన్న నిరక్షర కుక్షి మేలు గదన్న వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధమాట.

వచ్చిపోవువారు బంధువులు కాదు ఆదుకొన్నవాడే ఆప్తుండు ఆత్మబంధువు నీకు వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట.

ప్రాణి జగతికి వచ్చి పోవుట జరుగుచుండు మరలి రాని జన్మ నొందిన వాడేనురా మనిషి వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట.

అందమైన నెమలి స్వరము కర్ణ కఠోరము మది సౌందర్యము లేని పడతి మగని మంద భాగ్యము వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

29, ఆగస్టు 2010, ఆదివారం

వసుధ మాట

భేషజములు లేక బ్రంహవాక్యము పలుకు నిగర్వి యేనుర నిక్కమైన ఒక్క మూలగురువు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట .

వసుధ మాట

అమ్మ దేహమ్ము నిచ్చే ,అయ్య సొమ్ములుఇచె , దేవుడాత్మనిచ్చ్యే,గురువు విద్య నిచ్చ్యే సద్బుద్ధ్హి నీదిగా ఉండవలె నీవు వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

6, ఆగస్టు 2010, శుక్రవారం

వసుధ మాట

నీటి మీద రాత కంటి రెప్పవేత ఖలుని మంచి నడుత నిలిచి ఉండుట నిజమా? వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట.

సుఖములున్న బుద్ధికి బూజుపట్టు సంకటములు చేరి మెదడుకు మెరుగుబెట్టు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట.

పిల్లనిచ్చిన మామ ,ఆలి తెచ్చిన ఆస్తి,విద్య నేర్పని గురువు,వినయమీయని చదువు వెలలేనివి ఇలలోన వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట

ఎన్దుకూ కొరగాని కొడుకు కన్నా పని చేయ కంచర గాడిద మిన్న భక్తి లేసమైన లేని పూజ కన్నా దైవ దూషణమే మిన్న వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట .